ముఖ్యంగా అక్రమ సంబంధాలు నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెప్పాలి. అక్రమ సంబంధం తప్పు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ క్షణకాల సుఖం కోసం విలువలను మర్చిపోతున్న మనిషి నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జీవనోపాధి కోసం భార్యాభర్తలిద్దరూ కూడా హైదరాబాద్ వచ్చారు. అయితే సాఫీగా పని చేసుకుని బతకాల్సిన ఆమె భర్త స్నేహితుడి పై మనుసు పడింది. చివరికి అదే ఆమె కాపురం చింద్రం కావడానికి కారణమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గుండ్ల రేవుకు చెందిన క్యాబ్ డ్రైవర్ భూక్య మహేష్ అదే జిల్లా పాల్వంచ మండలం కరకబాబుకు చెందిన లతతో వివాహమైంది అయితే వీరికి ఒక పాప బాబు ఉన్నారు. మహేష్ కి రెండు సార్లు పక్షవాతం వచ్చింది. కాగా దంపతులు 6 నెలల కిందటే హైదరాబాద్ వచ్చి కెపిహెచ్బి హైదర్ నగర్ పరిధిలో ఉంటున్నారు. విక్రమ్ అనే మరో క్యాప్ డ్రైవర్ను నమ్మి మహేష్ రెండు సార్లు ఇంటికి తీసుకురాగా.. అతను లతకు చేరువయ్యాడు. చివరికి ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి తెరలేచింది. ఏకంగా వారి సుఖానికి అడ్డు వస్తున్నాడని భర్త మహేష్ను హతమార్చేందుకు సిద్ధమైంది మహిళ. ఇక అతని కుర్చీలో కూర్చోబెట్టి ఉరి పెట్టారు. తర్వాత భర్త మూర్చతో మృతి చెందినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించారు. అయితే అతను ఇంకా బ్రతికే ఉన్నాడని.. తెలిసి ఆసుపత్రిలో చేర్పించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి