
ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చెకిరిలో ఇలాంటి ఓ దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. స్వర్ణ జయంతి విహార్ లో ఒక ఉపాధ్యాయుడు.. తన భార్య పిల్లల కోసం ఎంతో ఇష్టంగా కోటి రూపాయల ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు. కానీ వ్యక్తి భార్య మాత్రం ఆ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ పై కన్నేసింది. చివరికి అక్రమ సంబంధానికి తెరలేపింది. చివరికి కాంట్రాక్టర్ తో కలిసి కారుతో ఢీ కొట్టి భర్తను చంపేసింది. సీసీ కెమెరాల్లో పూర్తిగా వీడియోలు రికార్డు కావడంతో చివరికి ఆమె చేసిన నేరం బట్టబయలు అయింది.
కాంట్రాక్టర్ తో ఉన్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడు అన్న కారణంతో ఇక ఇంతటి దారుణానికి ఒడి గట్టింది సదరు భార్య. కాంట్రాక్టర్ తన సోదరుడైన కారు డ్రైవర్ కు నాలుగు లక్షల రూపాయలు సుపారి ఇచ్చి మరి హత్యను ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నాలు చేశాడు. కాగా ఈ కేసులో అప్రమత్తమైన పోలీసులు భార్య, కాంట్రాక్టర్, అతని బంధువును కూడా అరెస్టు చేయగా.. హత్యకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.