
ఏకంగా ఒక వ్యక్తిని ప్రేమించిన పాపానికి ఎంతో మంది యువతి యువకులు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వస్తుంది. మరికొన్ని ఘటనల్లో ప్రేమను గెలిపించుకోలేకపోయామని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొన్ని ఘటనల్లో పెద్దలను ఎదిరించి మరి ప్రేమ పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది అన్న కారణంతో కని పెంచిన తల్లిదండ్రులే.. అత్యంత కిరాతకంగా హత్య చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ప్రేమించిన పాపానికి ఏదో ఒక రీతిలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది.
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే అని చెప్పాలి. ఏకంగా ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది ఆ యువతి. ఇక అతనే సర్వస్వం అనుకుంది. అయితే తీరా పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం సదరు ప్రియుడు కమర్షియల్ గా ఆలోచించాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని తిరువనంతపురం లో ఎక్కడైనా వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల షహనా ఒక యువ డాక్టర్ను ప్రేమించింది. అయితే ఆమె ప్రియుడు బంగారం, భూమి, బిఎండబ్ల్యూ కార్లు కట్నంగా ఇచ్చే స్తోమత ఆమె కుటుంబానికి లేదని తెలియడంతో పెళ్లికి నిరాకరించాడు. అవమానం తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మహిళా శిశు సంక్షేమ శాఖనూ ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం.