ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రపంచం మొత్తం పాకిపోయింది. మనుషులందరూ ఇంటర్నెట్ అనే మాయలోనే మునిగితేలుతున్నారు. అయితే అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్స్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇక ఎన్ని పనులు ఉన్నా ఇంటర్నెట్లో గడపడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవడం లేదు మనిషి. గంటల తరబడి సోషల్ మీడియాని ఉపయోగిస్తున్న వారు కూడా నేటి రోజుల్లో లేకపోలేదు.


అయితే సోషల్ మీడియా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పంచడమే కాదండోయ్ ఏకంగా తమ క్రియేటివిటీని నిరూపించుకొని భారీగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు కూడా ఎంతో మందికి ఒక మంచి అవకాశం గా మారిపోయింది. అయితే ఇంటర్నెట్లో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక అమెరికన్ వ్యక్తి ఇండియా పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే దుకాణం పెట్టుకున్న ఒక బార్బర్ తో హెడ్ మసాజ్ చేయించుకున్నాడు.


 ఈ క్రమంలోనే హెడ్ మసాజ్ చేయించుకున్న పర్యాటకుడు  మసాజ్ చేసిన వ్యక్తి పై ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ బార్బర్ కు ఎలాన్ మస్క్ జాబ్ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల సదరు విదేశీ యూట్యూబర్ ఇండియాకు వచ్చాడు. ఢిల్లీలో ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకునే బార్బర్ మహమ్మద్ వారిస్ వద్దకు వెళ్లి ఇతరులకు తలకు మసాజ్ చేస్తుండగా చూసి తను కూడా చేయించుకోవాలని అనుకున్నాడు. ఓపికగా క్యూలో వేచి చూసి మరి మహమ్మద్ తో మసాజ్ చేయించుకున్నాడు. పది నిమిషాల పాటు సాగిన ఈ మసాజ్ తో మ్యాక్స్ పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు. స్వర్గ లోకపు అంచనా దాకా వెళ్లాను. వీధుల్లో మసాజులు ఎందుకింత బాగుంటాయి అసలు నమ్మలేకపోతున్న ఇది నిజంగా బాగుంది అంటూ వారీస్  lమరిచిపోయి ఎన్నో కామెంట్లు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: