పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. పాతికేళ్ల ప్రాయంలో ఇక వందేళ్లపాటు తోడుండే తోడునూ జీవితంలోకి ఆహ్వానించే బంధమే పెళ్లి. ఇక పెళ్లిపై అటు యువతియువకులు ఇద్దరు కూడా కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలీ. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామినీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే ఇలాంటివన్నీ నేటి రోజుల్లో కేవలం మాటలకు మాత్రమే సరిపోతున్నాయి. నేటి రోజుల్లో పెళ్లి అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారిపోయింది. వరుడు ఎంత మంచి జాబ్ చేస్తున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని అమ్మాయి, అమ్మాయి తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు.



 అయితే ఎంత కట్నం ఇస్తున్నారు అని అటు అబ్బాయి తరపు బంధువులు చూస్తూ ఉండడంతో ఇలా పెళ్లి అనే విషయం నేటి రోజుల్లో కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. అయితే సేమ్ సినిమాల్లో లాగానే అటు నిజజీవితంలో కూడా ఏమాత్రం కట్న కానుకలు తగ్గిన పెళ్లి పీటల మీదే పెళ్లి ఆపేయడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు తెరమీదకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. కోరిన కారును కట్నంగా ఇవ్వలేదు అనే కారణంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజ్ ఫర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది.


 పెళ్ళికొడుకు అమీర్ అలా కట్నం గా హుందాయి క్రెటా కారును కోరాడు. అయితే వధువు తల్లిదండ్రులు కూడా కారును బహుమతిగా ఇస్తామని ముందు చెప్పారు  కానీ పెళ్లి సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఇక పెళ్ళికొడుకు అడిగిన హుండాయ్ క్రెటా కార్ కి బదులు అటు మారుతి వ్యాగన్ఆర్ కారును కట్నంగా ఇచ్చారు. ఇక చివరి నిమిషంలో ఈ విషయాన్ని తెలుసుకున్న వరుడు ఇక తనకు ఇష్టమైన కారును కొనలేదు అనే కారణం చెబుతూ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో వధువు కన్నీటి పర్యంతమయింది. అయితే తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వరుడును శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: