ప్రేమ వివాహాలు నేటి కాలంలో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. పెద్దలు చూసిన వివాహాలు ఎవరు చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన వ్యక్తిని ప్రేమించడం వివాహం చేసుకోవడం చేస్తున్నారు. అందులో కొంతమంది పెద్దల సమక్షంలో వివాహం చేసుకోగా.... మరి కొంత మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లి వివాహం చేసుకుంటున్నారు. పెళ్లిళ్లలో అనేక రకాల సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కో కులం, మతంలో ఒక్కో విధంగా వివాహ సాంప్రదాయం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని భావించాడు. 



కానీ పెళ్లి సాంప్రదాయం తెలుసుకున్న అనంతరం యువకుడు పురుగుల మందు తాగి మరణించాడు. వివరాల్లోకి వెళితే.... ఆదోని మండలం హనువాళు గ్రామానికి చెందిన రాజు ఎండి హళ్లికి చెందిన ఓ యువతిని చాలా సంవత్సరాల నుంచి ప్రేమించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. ఈనెల 16వ తేదీన ఈ జంట వివాహం నిశ్చయించారు. అయితే వధువు కుటుంబ సాంప్రదాయంలో వివాహం చేసుకోవడం ఆ యువకుడికి నచ్చలేదు.


 వధువు కుటుంబ సాంప్రదాయం గురించి తెలుసుకున్న అనంతరం రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో పెళ్లికి ముందు రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు వారం రోజులపాటు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజు మరణించడంతో తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం గురించి పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఈ విషయం గురించి ఆరా తీస్తున్నారు. రాజు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: