జర్మనీ పౌరుడైన ఒక వ్యక్తి అక్కడ మేయరుగా పని చేసి ఇక్కడకి వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇప్పటి వరకూ ఎవరూ లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ చరిత్రలో గాని ఇలా ఎవరూ లేరు. అయితే ఇదే విషయంపై కోర్టులో కేసులు వేస్తే రాజ్యాంగపరమైన ప్రశ్నలు రేకెత్తించారు. ఆ ప్రశ్నలు రేకెత్తించే లోపు ఆ టర్మ్ అయిపోయిందట. ఆ తర్వాత దాని పై టర్మ్ కూడా అయిపోయిందట.
దీనికి కారణం ఇక్కడి కోర్టులు, కేసులు, తీర్పులు బలహీనంగా ఉండడమే అని అంటున్నారు. చివరికి దీనిపై కేంద్రం హోం శాఖను నివేదిక కోరింది. హోం శాఖ కూడా కేంద్రానికి నివేదికను సమర్పించింది. కానీ కోర్టులో మాత్రం కేసు జరగ లేదు. కానీ ఈసారి మాత్రం ఆ తప్పు జరగకుండా ఇటు కేసీఆర్ మాత్రమే కాదు అటు కేటీఆర్ కూడా జాగ్రత్తగానే ఉన్నారు అని తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీ నరసింహ రావును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
లక్ష్మీనరసింహారావుని ఎన్నుకోవడంతో ఆయన అభిమానులు సంతోషంగా సంబరాలు చేసుకున్నారట. బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో కేసిఆర్ ఈయన పేరును కూడా చెప్పారని తెలుస్తుంది. నియోజక వర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకుని మూడో సారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలుపుకు వస్తానని ఆయన చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి