జగన్ ప్రభుత్వం పోయింది. కూటమి సర్కారు వచ్చింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రభుత్వాన్ని మార్చేశారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే.. 2019కి 2024 కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోయి.. వైసీపీ వచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన అంశాలతో జగన్ ముందుకు సాగారు. గత ప్రభుత్వ పథకాలను పూర్తిగా రద్దు చేసి తనదైన మార్కు వేశారు.


అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో ప్రారంభించిన పనులు కూడా వైసీపీ ప్రభుత్వం కావాలనే పూర్తి చేయలేదు అని టీడీపీ ఎన్నికల సమయంలో గట్టిగా ప్రచారం చేసింది.  గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించే స్థలాన్ని చంద్రబాబు మీద కోపంతా వేరొక చోటుకి మార్చారని ఆరోపించారు. ఇలా చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందని వారు ప్రచారం చేశారు. అయితే వాస్తవానికి ఆ భూమిలో న్యాయపరమైన చిక్కులు ఉండటంతో విశ్వ విద్యాలయ నిర్మాణాన్ని కేంద్రం ఆపేస్తే..


గత వైసీపీ ప్రభుత్వం అప్పుడు కేంద్రంతో మాట్లాడి స్థలాన్ని మార్చుతాం విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పండి అని  చెబితే అప్పుడు కేంద్రం ఓకే చెప్పింది. కేంద్రం ఒక్కసారి ఒకటి ఫిక్స్ చేశాక దానిలో మార్పులు చేయాలంటే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ఈ విషయంలో అదే జరిగింది.  ఒకవేళ చంద్రబాబుకి పేరు వస్తుందని భావిస్తే ఎయిమ్స్ ను చంద్రబాబే ప్రారంభించారు. కానీ దానిని పూర్తి చేసింది నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి.


వాస్తవానికి ఈ క్రెడిట్ కేంద్రానికి వెళ్లాలి. కానీ చంద్రబాబు గ్లోబెల్ ప్రచారం చేసుకొని ఈ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటారు. కేంద్ర సంస్థల నిర్వహణ చాలా స్లోగా ఉంటుంది.  ఏడాదికి కొంత చొప్పున వారిచ్చే పథకాలకు నిధులు కేటాయిస్తూ వస్తుంటారు. గిరిజన విశ్వ విద్యాలయ విషయంలో ఇదే జరిగింది. కానీ ఏపీలో ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ భవనాలు.. ఇతర అభివృద్ధి పనులను జగన్ పై నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి వాటిని పూర్తి చేసి.. నేనే చేశాను ఇదంతా అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. తప్పులు మాత్రం జగన్, వైసీపీపై నెట్టేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: