యావత్ ప్రపంచదేశాలు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే మనదేశం మాత్రం మర్కజ్ మసీదు దెబ్బకు వణికిపోతోంది. మనదేశంలో కరోనా వైరస్ కేసులను లెక్కించాలంటే మర్కజ్ మసీదు ప్రార్ధనలకు ముందు తర్వాత అన్న పద్దతిలో లెక్కించాల్సుంటుంది. ప్రపంచదేశాల్లో వైరస్ బాగా ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చైనా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిల్, ఇరాన్ లాంటి దేశాలు వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న సమయంలో కూడా మనదేశంలో వైరస్ ప్రభావం అంత తీవ్రంగా లేదనే చెప్పాలి.

 

ఇంకా కచ్చితంగా చెప్పాలంటే దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్న వాళ్ళు ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన తర్వాతే వైరస్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోయింది. మార్చి 30వ తేదీ వరకు నియంత్రణలోనే ఉన్న బాధితుల సంఖ్య తర్వాత రోజు నుండే ఒక్కాసరిగా ఎక్కువైపోయింది.  సమస్య  ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం 16 రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో  తీవ్ర ప్రభావం పెరిగిపోయింది.

 

కేసులు పెరిగిపోతున్న కారణంతోనే చాలామంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను కంటిన్యు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడికి విజ్ఞప్తులు చేస్తున్నారు. మూడు వారాలు లాక్ డౌన్ పాటిస్తే వైరస్ కేసులు నియంత్రణలోకి వస్తుందని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అంచనా వేశాయి. నిజానికి ప్రభుత్వాలు అనుకున్నట్లు జరిగేదే. కానీ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలు అందరి అంచనాలను ఒక్కసారిగా తల్లకిందులు చేసేశాయి. ప్రభుత్వాలు ఊహించని రీతిలో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.

 

కేవలం మర్కజ్ దెబ్బకే లాక్ డౌన్ కాలాన్ని ఇంకా  పొడిగించాలంటూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేలా పరిస్ధితులు దిగజారిపోతున్నాయి. నిజానికి మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు హాజరైన వారిలో చాలామంది వాళ్ళ రాష్ట్రాల్లో  కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే క్వారంటైన్ సెంటర్లో, ఐసొలేషన్ వార్డుల్లో ఉన్న కొందరు వైద్యానికి సహకరించకుండా అసభ్యంగా ప్రవర్తిస్తుండటం, మరికొందరు ప్రభుత్వాలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుండటం వల్లే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

 

తప్పించుకు తిరుగుతున్న వారిని పట్టుకోవటానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఉపయోగం కనబడటం లేదు. అదే సమయంలో తప్పించుకు తిరుగుతున్న వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ? ఎవరెవరిని కలుస్తున్నారో కూడా అర్ధం కావటం లేదు. కమ్యూనిటి స్ప్రెడింగ్ వల్లే వైరస్ చాలా తొందరగా వ్యాపిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే వాళ్ళు మాత్రం ఇంకా దొరక్కుండా తిరుగుతున్నారంటే ఏమనాలి ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: