వారం వారం త‌న కొత్త‌ప‌లుకు శీర్షిక‌తో ప్ర‌పంచానికి నీతులు చెప్పే ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిఅధిప‌తి ఆర్కే గురించి ఇటీవ‌ల కాలంలో వ‌స్తున్న సోష‌ల్ మీడియా వార్తలు ఇంకా పుంఖాను పుంఖాలుగా వ‌స్తూనే ఉన్నా యి. ఎక్క‌డా వాటికి ఫుల్ స్టాప్ ప‌డ‌డం లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉద్యోగుల‌ను న‌డివీధిలోకి నెట్టాడ‌ని వార్తలు విమ‌ర్శ‌లు జోరెత్తాయి. అదే స‌మ‌యంలో ఆఫీసుల్లో ఎలాంటి ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేద‌ని కూడా సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా కూడా ఆర్కే.. మీరు న‌వ్విపోయినా.. నాకేటి! అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రో విష‌యంపైనా సోష‌ల్‌మీడియా దుమ్మ‌త్తి పోస్తోంది.

 

ఒక‌ప‌క్క‌, ప్ర‌భుత్వాల‌కు వివిద స్థాయిల్లో కార్పొ రేట్ వ‌ర్గాలు అన్నీ క‌రోనా సేవ కోసం నిధులు ఇస్తున్నాయి. నిజానికి ప్ర‌భుత్వాల నుంచి వాటికి ఎలాంటి లాభం లేక‌పోయినా..(అంటే అనుమ‌తులు ఇచ్చారు అంతే. ఇవి మీడియాకు కూడా ఇచ్చారు) అవి కోట్ల‌కు కోట్లు ప్ర‌భుత్వాల‌కు క‌రోనా సాయం కింద అటు ప్ర‌ధాని స‌హాయ నిధికి, ఇటు సీఎంల స‌హాయ‌నిధుల‌కు ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏమాట‌కామాట చెప్పుకోవా ల్సి వ‌స్తే.. ఈనాడు అధిప‌తి రామోజీరావు అటు తెలంగాణ‌కు, ఇటు ఏపీకి కూడా చెరో ప‌ది కోట్ల చొప్పున‌.. మొత్తం రు. 20 కోట్లు ఉదారంగా ఇచ్చార‌నే చెప్పాలి. 

 

అంతే కాదు ఆయ‌న అటు పీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా కోట్ల‌లోనే ఇచ్చారు. నిజానికి రామోజీ ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు. మ‌రి ప్ర‌పంచానికి నీతులు చెప్పే ఆర్కే.. ఈ క‌రోనా స‌మ‌యంలో త‌న సంస్థ‌లు ఉన్న అటు తెలంగాణ లోకానీ, ఏపీలో కానీ ప్ర‌భుత్వాల‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డం స‌మంజ‌స‌మా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. నిజానికి తాను విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఎప్పుడైనా ఇవ్వాల్సి వ‌స్తే.. ఉద్యోగుల జీతాల నుంచి ఒక రోజు వేత‌నం ఇస్తూ.. అంతా తాము ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించుకునేవారు. 

 

క‌నీసం ఇప్పుడు జీతాల నుంచి కోత పెట్టి ఆ పాతి కి శాత‌మైనా ప్ర‌భుత్వాల‌కు సాయం ఇస్తే.. బాగుండేది క‌దా?  ఈ మాత్రం మ‌న‌సు రాలేదా కృష్ణా!? అంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు జోరెత్తుతున్నాయి. మీరేమంటే అది అనుకోండి నాకెందుకు? అని ఆర్కే దులిపేసుకుంటుండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం!!

మరింత సమాచారం తెలుసుకోండి: