చంద్రబాబునాయుడుకు అమరావతి ప్రాంతం జనాలు పెద్ద షాకే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పారిపాలన ఏడాది అయిన సందర్భంగా సీపీఎస్ అనే సంస్ధ జననాడిని తెలుసుకునేందుకు సర్వే చేసింది. అనేక అంశాలపై రాష్ట్రంలోని 44 నియోజకవర్గాల్లో సర్వే జరిపింది. సర్వేలోని ఏ ఒక్క అంశంలో కూడా జనాలు చంద్రబాబు వైపు మొగ్గు చూపకపోవటం గమనార్హం. సరే ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేసినా  జగన్ పనితీరుపై వివిధ  ప్రాంతాల్లో  జనాలు అభిప్రాయం ఏమిటనే విషయం జనాభిప్రాయంతో చంద్రబాబుకు దిమ్మతిరగటం ఖాయమే.

 

 

ఇంతకీ విషయం ఏమిటంటే నార్త్ కోస్టల్ ఆంధ్ర, గోదావరి జిల్లాలు, అమరావతి రీజియన్, సౌత్ కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సర్వే జరిగింది. మిగితా ప్రాంతాల్లో జనాభిప్రాయాన్ని పక్కన పెట్టేస్తే అమరావతి ప్రాంతంలో కూడా జనాల మద్దతు జగన్ వైపు ఉండటం చంద్రబాబుకు మింగుడుపడనిదే. ఎందుకంటే మూడు రాజధానులను జగన్ ప్రతిపాదించినప్పటి నుండి ఆందోళనల పేరుతో చంద్రబాబు, ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా ఎంత హడావుడి చేసిందో అందరూ చూసిందే.  నిజానికి జగన్ ప్రకటనపై  అమరావతి ప్రాంతంలోని కేవలం ఓ ఆరేడు గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు జరిగాయి. ఇందులో కూడా పెయిడ్ ఆర్టిస్టులు జరిపిన ఆందోళనలే ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.

 

సరే ఆందోళనల్లో పాల్గొంటున్నది ఎవరైనా చంద్రబాబు మాత్రం ఆందోళనలకు పూర్తి మద్దతిచ్చి రంగంలోకి దిగాడు. ఆందోళనల తీవ్రతను పెంచేందుకు విరాళాల కోసం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జోలెపట్టాడు. చివరకు ఉద్యమ ఊపు కోసం భార్య భువనేశ్వరి బంగారు గాజులను కూడా విరాళంగా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  ఆందోళనలు నిజంగా జరిగాయో లేదో కానీ ఎల్లోమీడియాలో మాత్రం ఆందోళనలు జరుగుతున్నట్లు కలరింగ్ ఎక్కువగా ఇచ్చారు. సరే ఆందోళనలన్నీ కరోనా వైరస్ కారణంగా ఒక్కసారిగా నీరుకారి పోయాయి. దాంతో ప్రస్తుత ఆందోళనంతా కేవలం ఎల్లోమీడియాలో మాత్రమే కనబడుతోంది.

 

రాజధానిగా అమరావతిని తరలించకూడదంటూ చంద్రబాబు ఎన్ని ఆందోళనలు చేసినా జనాలు మాత్రం జగన్ పాలనే బాగుందని చెప్పటంలో అర్ధమేంటి ? జగన్ ఏడాది పాలన ఎలాగుందనే విషయంలో సర్వే చేస్తే  అమరావతి ప్రాంతంలోని జనాలు 54.9 శాతంమంది బాగుందని చెప్పటం గమనార్హం. జగన్ పాలన బాగాలేదని చెప్పిన వాళ్ళ శాతం 42.1 . ఎటు తేల్చుకోలేని వాళ్ళ శాతం 3. తాజా సర్వేలో అమరావతి ప్రాంతంలో కూడా 54 శాతంమంది జనాల పరిపాలన బాగుందని మెచ్చుకున్నారంటే అందుకు అమలవుతున్న సంక్షేమ పథకాలే ప్రధాన కారణంగా అనుకోవాలి.

 

తాజా సర్వే ప్రకారం రాజధానిగా అమరావతిని విశాఖపట్నంకు తరలించినా జనాల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదనే అర్ధమవుతోంది.  మరి చంద్రబాబు లేవనెత్తిన ఆందోళనంతా పెయిడ్ ఆందోళనగానే మెజారిటి జనాలు అర్ధం చేసుకున్నారా ?  ఈ సర్వేలో బయటపడిందేమంటే చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో కూడా మెజారిటి జనాల మద్దతు లేదని. కాబట్టి ఇకనుండైనా చంద్రబాబు ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని అందుకు అనుగుణంగా రాజకీయాలు చేస్తే బాగుంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: