జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలన విషయంలో మెజారిటి ప్రజలు ఒకలాగ అభిప్రాయపడితే ప్రతిపక్షాల ఆలోచనలు మాత్రం మరోలాగ అభిప్రాయపడుతున్నాయా ? ఈనెల 2-8 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 44 నియోజకవర్గాల్లో సిపీఎస్ సర్వే నిర్వహించింది.  ప్రభుత్వ పనితీరుపై 2881 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో జగన్ పాలన విషయంలో జనాల మద్దతు స్పష్టంగా కనబడింది.  అనేక విషయాల్లో జగన్ పాలనకు జనాలు జేజేలు పలికితే ప్రతిపక్షాలు ప్రత్యేకించి చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా మాత్రం పూర్తి నెగిటివ్  రాజకీయాలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఇంగ్లీషుమీడియం విషయం తీసుకుంటే  71.6 శాతంమంది జగన్ నిర్ణయానికి పూర్తి మద్దతు పలికారు. అయితే ఇదే విషయంలో చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా మాత్రం తప్పుపట్టిన విషయం అందరూ చూసిందే. అంటే మెజారిటి ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా రాజకీయాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. కరోనా వైరస్ నియంత్రణకు జగన్ తీసుకుంటున్న చర్యల బాగున్నాయంటూ 75.8 మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇదే విషయంలో చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రతిరోజు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయని రోజులేదు.

 

తానిచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నట్లు 63.9 శాతంమంది అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా మాత్రం ఇచ్చిన హామీల అమలులో జగన్ ఫెయిలైనట్లు ప్రతిరోజు మండిపడుతున్న విషయాలు అందరూ చూస్తున్నదే. అంటే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పై బురద చల్లుతున్న విషయం అర్ధమైపోతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికే ఓట్లేస్తామని 55.8 శాతంమంది స్పష్టంగా చెప్పారు. ఇదే అంశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి అధికారంలోకి రావటం ఖాయమని ఎన్నిసార్లు చెప్పాడో అందరు చూసిందే.

 

జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే వైసిపి పాలన విషయంలో ప్రజల మద్దతు పెరిగిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. పోయిన ఎన్నికల్లో వైసిపికి వచ్చింది 49.9 శాతంమందే. ఇపుడు 55 శాతంమంది మద్దతుగా నిలబడ్డారంటే ఏకంగా 6 శాతం ఓటర్ల మద్దతు పెరగటమంటే మామూలు కాదు.  ఏడాదిలో జగన్ సంక్షేమపథకాల మీద ఎక్కువగా దృష్టిపెట్టాడు. ఇక నుండి అభివృద్ధిపైన కూడా దృష్టిపెడితే భవిష్యత్తులో మరింతమంది మద్దతు లభించే అవకాశం ఉంది.

 

జనాల్లో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందని చంద్రబాబు, ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా కూడా కలలు కంటున్నాయి. ఏడాది పాలనలో జగన్ సాధించిందేమీ లేదంటూ బోలెడు కథనాలు కనిపిస్తున్నాయి ఎల్లోమీడియాలో. అయితే జనాలభిప్రాయం చూస్తే మాత్రం వీళ్ళ కథనాలతోను ఆరోపణలు, విమర్శలతోను సంబంధం లేదన్న విషయం తెలిసిపోతోంది. అంటే ఎల్లోమీడియా ద్వారా జనాల్లో వ్యతిరేకతను పెంచాలని చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదని అర్ధమైపోతోంది. జనాల మూడ్ చూస్తుంటే  భవిష్యత్తులో టిడిపి శాస్వతంగా ప్రతిపక్షానికే పరిమితమైపోతుందన్న విషయం అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: