క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌లు స్వ‌ర్గ‌స్తుల‌య్యాక త‌మిళ‌నాడు రాజ‌కీయం కొన్నాళ్లు..సంక్షోభంలో చిక్క‌కుని... ఆ త‌ర్వాత కుదుట‌ప‌డినా.. జాతిని ప్ర‌భావితం చేసే నేత‌లు కాద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ర‌జ‌నీ, క‌మ‌ల్ తెర‌పైకి వ‌చ్చారు. ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌కుండానే స్వ‌స్తి అంటూ ప్ర‌క‌టించేశారు. ఇక క‌మ‌ల్ ఆరంభంలో ఉన్నారు. ఆశ‌లు రేపుతున్నాడు. ప‌ల‌నీ, ప‌న్నీరు వంటి నేత‌లు ఉన్నా.. పార్టీ బ‌ల‌మే వారికి కావాలి. వారు పార్టీల‌కు బ‌లం కాలేర‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో  చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేల‌తో పొత్తుల‌కే ప‌రిమిత‌మ‌వుతుంటాయి. బీజేపీ రాష్ట్రంలో పాతుకుపోవాల‌ని శ‌త‌విధాలా య‌త్నిస్తున్నా.. సాధ్యం కావ‌డం లేదు. ఇప్ప‌టికిప్పుడు అసాధ్య‌మ‌నే చెప్పాలి.


భ‌విష్య‌త్‌లో ఎలాంటి మార్పులు జ‌రుగుతాయో చెప్ప‌లేం గాని ప్ర‌స్తుత ప‌రిస్థితులు మాత్రం ఆ పార్టీకి పెద్ద‌గా ఆశాజ‌న‌కంగా లేవ‌నే చెప్పాలి. బీజేపీని ఉత్త‌రాది పార్టీగా, తమిళుల ఆత్మ‌గౌర‌వాన్ని ప‌ట్టించుకోని పార్టీగానే త‌మిళులు భావిస్తున్నాడు. అందుకే ద్ర‌విడ పార్టీల్లోనే ఏదో ఒక‌టి ఎన్నిక‌ల్లో ఇన్నాళ్లు గెలిపిస్తూ వ‌స్తున్నారు. ప్రాంతీయ పార్టీల‌కు త‌ప్పా... జాతీయ పార్టీల‌కు ఇక్క‌డ చోటు లేద‌న్న‌ట్లుగా ఐదేళ్ల‌కు ఒక‌సారి త‌మిళులు ఓటు తీర్పు ఇస్తుంటారు. అయితే ఇద్ద‌రు రాజ‌కీయ యోధుల మ‌ర‌ణం త‌ర్వాత‌.. మ‌రో బ‌ల‌మైన‌ రాజ‌కీయ నాయ‌క‌త్వం కోసం త‌మిళ‌నాడు ఎదురు చూస్తోంది. జ‌య‌ల‌లిత నిచ్చెలిగా.. ప్రియ‌నేస్తంగా ఉన్న శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌లవుతుండ‌టం ఇప్పుడు త‌మిళ‌నాడు రాజ‌కీయ నేత‌ల‌నే కాదు.. దేశ ప్ర‌ముఖుల చూపు ఆమె వైపు చూసేలా చేస్తోంది.


మ‌రి కొద్దిరోజుల్లోనే త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎలాంటి రాజ‌కీయ ప్ర‌క‌ట‌న ఆమె నుంచి రానున్న‌ద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీకి ఆమె నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంది.ఆమె ఖ‌చ్చితంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తార‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవి స్తున్న శశికళ బుధవారం ఉదయం 11 గంటలకు బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్నారు. కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆస్పత్రిలో వున్న శశికళకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను సమర్పించనున్నారు.  ఫిబ్రవరి మొదటివారంలో ఆమె చెన్నై నగరానికి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: