రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన గురించి జనం బేరీజు వేసుకోవడం సాధారణమే. ఏ సీఎం ఏ చేస్తున్నారు.. ఏ సీఎం నిర్ణయాలు బావున్నాయి.. ఏ సీఎం ఏ అంశంపై ఎలా స్పందిస్తున్నారు.. ఎవరి కంటే ఎవరు బెటర్ అన్న చర్చ సాధారణ జనంలోనూ వస్తుంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎలా ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని కూడా జనం పరిశీలిస్తుంటారు. అయితే కరోనా విషయంలో ఇప్పుడు ఇదే పరిస్థితి వస్తోంది. కరోనా కట్టడికి ఏ సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. ఎవరు బెస్ట్ అన్న చర్చ జనంలో వస్తోంది.

అయితే కొన్ని విషయాల్లో కేసీఆర్‌ను జగన్ ఫాలో అయితే.. మరికొన్ని విషయాల్లో జగన్‌ను కేసీఆర్ ఫాలో అవుతుంటారు. ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ యాదృశ్చికంగా ఒకే స్థాయిలో నిర్ణయాలు వచ్చాయి. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ విషయంలో రెండు రాష్ట్రాలు ఇంచుమించి ఒకే తరహా నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. మొన్న తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జగన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ముందుగా వ్యాక్సినేషన్ చేయాలని.. వారు విదేశాలకు వెళ్లేందుకు అది ఉపయోగపడుతుందని తెలంగాణ కేబినెట్ మొన్న నిర్ణయించింది.

ఈ విషయాల్లో జగన్ సర్కారు కేసీఆర్ సర్కారును ఫాలో అయ్యింది. తాజాగా జగన్ సర్కారు కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి ముందుగా వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించింది. అలాగే మొన్న తెలంగాణలో ఏడు వైద్య కళాశాలలకు కేసీఆర్ సర్కారు పచ్చజెండా ఊపింది. ఇటు జగన్ కూడా ఏకంగా 14 మెడికల్ కాలేజీల శంకుస్థాపన కార్యక్రమం చేసేశారు.

మొన్న ఆదాయం కోసం తెలంగాణలో భూములు అమ్మాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. అయితే ఈ పని గతంలోనే జగన్ సర్కారు ప్రారంభించేసింది. అయితే అందులో కొన్ని కోర్టు తీర్పుల కారణంగా పెండింగ్‌లో ఉండిపోయాయి. మొత్తానికి జగన్, కేసీఆర్ ఒకరినొకరు ఫాలో అవుతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: