అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ప్రతిపక్షాలకు ఆయుధంగా ఇదే విధానం మారిందనేది వైసీపీ నేతల గుసగుసల సారాంశం. తాజాగా విపక్ష నాయకులు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంది సలహాదారులు ఎందుకు అంటూ.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించని ఈబీసీ నేస్తం ఎందుకు ? అని నిలదీస్తున్నారు. ఇక, జగన్ వినియోగిస్తున్న హెలికాప్టర్ విషయాన్ని కూడా సొంత పార్టీ ఎంపీ ఒకరు నిలదీశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని సృష్టించాయి. దీంతో ఇలా కాకుండా.. మరో మార్గం ఏదైనా ఉంటే బాగుంటుందని .. వైసీపీ నాయకులు అంటున్నారు.
వాస్తవానికిరాష్ట్రమే కాదు.. కరోనా దెబ్బతో కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఆర్థిక సమస్యలో ఉన్నదని.. ఇతర రాష్ట్రాల్లలోనూ వేతనాలు ఆలస్యం అవుతున్నాయని.. అబివృద్ది కూడా ముందుకు సాగడం లేదేని.. అయితే.. అక్కడి ప్రభుత్వాలు.. ఇలా చెప్పుకోవడం లేదని.. దీనికి మరో మార్గం ఆలోచించాలని.. వైసీపీ నాయకులు అంటున్నారు. ఆర్తిక పరిస్థితి బాగోనప్పుడు.. ఇలాంటి విమర్శలు వస్తుంటాయని.. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే పరిస్థితి కూడా మనకు లేకుండా పోతోందని వారు అంటున్నారు. ఈ విషయంలో అధినేత మరో మార్గం ఏదైనా ఆలోచించాలని వారు కోరుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా.. బాగున్నట్టుగానే చెబుతున్నారని అంటున్నారు. కరోనాకు తోడు సంక్షేమంపై ఎక్కువుగా దృష్టి పెట్టడం, రాష్ట్రంలో అసలు అభివృద్ధి అన్నది కనపడకపోవడం, ఆ ప్రభావం పలు రంగాలపై పడడంతో కూడా రోజు రోజుకు పెరుగుతోన్న నిత్యావసరాలు ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో కొత్త ఆలోచనలకు కారణంగా కనిపిస్తున్నాయి. జగన్ ఎంత సంక్షేమం చేశామని చెపుతున్నా.. పై విషయాల్లో ఆలోచన చేయకపోతే పెద్ద దెబ్బ తప్పదని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి