టీడీపీ మహానాడు కార్యక్రమం జరుగుతోంది. ఏటా మే నెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకోవడం టీడీపీకి ఓ సాంప్రదాయం. మే 28 ఎన్టీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఎన్టీఆర్ కాలం నుంచి వస్తున్న పార్టీ సాంప్రదాయం ఇది. ఇప్పుడు ఒంగోలులో ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే.. ఈ కార్యక్రమంపై సహజంగానే వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. అయితే.. వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ఈసారి మరీ డోస్‌ పెంచేశారు. ఏకంగా మహానాడును ఓ శ్రాద్ధ కార్యక్రమం అంటూ మండిపడ్డారు.


ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న కార్యక్రమం మహానాడు కాదని.. తన మామ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, ఆయనకు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారకుడయ్యాడయ్యాడు  కాబట్టి అది హత్యతో సమానం అని విజయ సాయి రెడ్డి అంటున్నారు. అందుకే టీడీపీ మహానాడు నిర్వహించడం అంటే ఎన్టీఆర్‌కు సంవత్సరీకం అంటే  తద్దినం పెట్టడమేనట. మహానాడులో  పెట్టే ఆహారం కూడా ఒక శ్రాద్ధంతో సమానం అని.. ఎవరైనా చనిపోతే శ్రాద్ధం పెడితే ఆ శ్రాద్ధాన్ని కాకులు వచ్చి తినిపోతాయని.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని విజయ సాయి రెడ్డి ఘాటుగా విమర్శించారు.


అంతే కాదు.. అది మహానాడు కాదు మహా ప్రస్థానం అంటూ మరో అర్థం తీశారు విజయ సాయి రెడ్డి.. మహా ప్రస్థానం.. మహా స్మశానం అంటూ విరుచుకుపడ్డారు. అప్పుట్లో నందమూరి తారక రామారావు ఎంతో ఉన్నతాశయంతో 1982లో టీడీపీని స్థాపించారని.. కానీ ఆయన ఈరోజు లేడని ఇప్పుడు పార్టీలో ఉన్నదంతా రామారావులు కాదు.. కామారావులేనని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు.


టీడీపీలోకి.. పనికిమాలిన వెధవలంతా వచ్చి రాష్ట్రాన్ని పాలించాలని ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్రంలోని సంపదనంతా కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారని విజయి సాయి రెడ్డి అంటున్నారు. అందుకే  కిక్‌ బాబు.. సేవ్‌ ఏపీ..  అన్న నినాదంతో వైసీపీ ప్రజల ముందుకు వెళ్తుందని విజయ సాయి రెడ్డి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: