అగ్నిపథ్ విధానంపై యువత తీవ్రంగా మండిపడ్డారని.. దేశంలో అనేక చోట్ల రైళ్లను తగల బెట్టారని ఇప్పటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే... రెండు, మూడు రోజులుగా ఈ అగ్నిపథ్ పై సైన్యంలోని కీలక అధికారులు ప్రెస్ మీట్లు నిర్వహించి స్పష్టత ఇవ్వడం ప్రారంభించారు. అగ్నిపథ్‌ పై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. అగ్నిపథ్‌ విధానం వచ్చినా సైనికుల నియామక ప్రక్రియలో మార్పులు ఉండవని మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ చాలా స్పష్టంగా చెబుతున్నారు.


అగ్నిపథ్‌ పథకం అమలు తర్వాత కూడా సాంప్రదాయ రెజిమెంటేషన్ వ్యవస్థ కొనసాగుతుందని మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ తెలిపారు. అగ్నిపథ్‌పై విశ్వసనీయ సమాచారాన్ని సైనిక దళాలు అందించాయని.. దీని వల్ల తప్పుడు సమాచారానికి తెరపడిందని మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ తెలిపారు.


సైన్యం వివరణ ఇచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఇప్పటికే యువకులు అగ్నిపథ్‌ కోసం సాధన ప్రారంభించారని మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ చెబుతున్నారు. అగ్నిపథ్ పై యువతలో అపోహలు తొలగిపోయాయని.. ఇప్పుడు యువత అగ్నిపథ్‌ లో చేరేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ చెబుతున్నారు.


అగ్నిపథ్ విధానాన్ని అంత సులభంగా తీసుకురాలేదని.. సుదీర్ఘ కాలం పాటు త్రివిధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య సంప్రదింపుల తర్వాతే ఈ కొత్త అగ్నిపథ్‌ విధానం తెచ్చినట్టు మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ చెబుతున్నారు. 1989 నుంచి వేర్వేరు కమిటీలు ఈ విషయంలో ప్రతిపాదనలు ఇచ్చినట్లు అనిల్‌ పురీ వెల్లడించారు. అగ్నిపథ్‌లో చేరాలంటే ఎలాంటి హింసాత్మక ఘటనల్లో పాలుపంచుకోలేదని అగ్నివీరులు హామీ ఇవ్వాల్సి ఉంటుందని అనిల్ పురీ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: