రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా.. ఆయన పరిస్థితి విషమంగా ఉందా.. ఆయన కోలుకోలేని అస్వస్థతకు గురయ్యారా.. ఇప్పుడు ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి మళ్లీ అలాంటి వార్తలు వస్తున్నాయి. గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పుతిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటల పాటు చికిత్స అందించారని అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి.


గతవారం పుతిన్ మరోసారి తీవ్ర అనారోగ్యం బారినపడినట్లు తాజా వార్తల ద్వారా తెలుస్తోంది. గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పుతిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. ఆయన  పారామెడికల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి వైద్యులు చేరుకున్నారట. దాదాపు మూడు గంటలపాటు చికిత్స అందించారట. జులై 22 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర వికారంగా ఉన్నట్లు పుతిన్‌ తన సహాయకులకు చెప్పినట్టు తెలుస్తోంది.


అయితే  విధుల్లో ఉన్న పారామెడికల్‌ సిబ్బంది ఓ ఇరవై నిమిషాలపాటు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించి ఆ తర్వాత కూడా పరిస్థితి కుదుటపడకపోయేసరికి ప్రత్యేక వైద్య బృందానికి సమాచారం అందించారట. హుటాహుటిన పుతిన్‌ ఛాంబర్‌కు చేరుకున్న వైద్యులు.. మూడు గంటలపాటు చికిత్స అందించారట. ఆ తర్వాత పుతిన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు చెప్పారట. ఆ తెల్లవారుజామున పుతిన్‌ ఛాంబర్‌ నుంచి వైద్యులు బయటకు వెళ్లిపోయారట.


ఈ మేరకు రష్యాకు చెందిన ఓ వార్తా ఛానెల్‌ లోనూ కథనాలు వచ్చాయి. అయితే.. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. పుతిన్‌కు క్యాన్సర్‌ అనీ..  పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్నారని ప్రచారం జరిగింది. కొన్ని మీటింగుల్లో పుతిన్ చేతులు, కాళ్లు వణుకుతున్నట్లు కనిపించాయనే ప్రచారం జరిగింది. అయితే.. ఇటీవలే అమెరికా అత్యున్నత అధికారి అలాంటి వార్తలను తోసి పుచ్చి పుతిన్ బేషుగ్గా ఉన్నాడని అన్నారు. ఇంతులోనే పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ ఇలాంటి వార్త వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: