యూరప్ దేశాలు అన్నీ కలిపి నాటో గా అవతరించిన విషయం తెలిసిందే. ఆయా యూరప్ దేశాల మధ్య  ఒక అవగాహన ఒప్పందం ఉంది. దీనికి సంబంధించి నాటో దేశాల పైన ఏ దేశమైనా దాడి చేస్తే ఆ దేశానికి వ్యతిరేకంగా ఆ 20 దేశాలు కచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. వాటికి సహకరించాల్సిందే. కానీ నాటోలో లేనటువంటి ఉక్రెయిన్తో రష్యన్ వాళ్లు యుద్ధం చేస్తుంటే దానికి సంబంధించి యూరప్ దేశాలు ఆయుధాలను,.యుద్ధ ట్యాంకర్ల ను  మిసైల్స్ ని అన్నింటిని అందిస్తుంది. దీన్ని రష్యా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.


నాటోలో సభ్యత్వం లేని దేశానికి పరోక్షంగా సాయం చేయడం అంటే రష్యాతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నట్టే లెక్క అని రష్యా విదేశాంగ మంత్రి లావరోచ్ అన్నారు.  ఒక జర్మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దేశానికి నాటోలో సభ్యత్వం లేదు. కానీ యూరప్ దేశాలు విచ్చలవిడిగా ఉక్రెయిన్ కు యుద్దసామాగ్రిని అందజేస్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా రష్యాతో యుద్ధానికి అవి దిగుతున్నట్టే లెక్క. ఇలాంటి చర్యలు ఏమాత్రం మంచివి కావు. ఒకవేళ ఉక్రెయిన్ లో వాటి భావజాలాన్ని అమలు చేయాలని భావిస్తే ఆ 20 దేశాలు కలిపి రష్యాపై యుద్ధం ప్రకటిస్తున్నట్టే లెక్క. దీన్ని ఏమాత్రం అంగీకరించమని ఇలాంటి పరిణామాలకు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అన్నారు.


కాబట్టి దానికి సహకరిస్తున్న యూరప్ దేశాలు అవి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇది ఏ మాత్రం సరైన విధానం కాదని రష్యా ఆరోపిస్తోంది. సాయం చేస్తున్న యూరప్ దేశాలు అవి తమ సొంత లాభం కోసమే చేస్తున్నాయని తద్వారా అవి ప్రయోజనం పొందాలనుకుంటున్నది ఎప్పటికీ నెరవేరదని రష్యా అంటుంది. మొత్తం మీద రష్యా ఉక్రెయిన్  మధ్య యుద్ధం రష్యాని ఒకవైపు అన్ని యూరప్ దేశాలని మరోవైపుగా మార్చేసింది అమెరికా సైతం రష్యాకు దూరంగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: