ఇండియా టుడే 23 సంవత్సరాలుగా మూడ్ ఆఫ్ ద నేషన్ అనే విధానంతో సర్వే చేపడుతుంది. దీంతో ఓటర్ల నాడిని తెలుసుకోవడం ఓటర్లు ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రానుంది అనే ఎగ్జిట్ పోల్స్ విధానాన్ని ప్రకటిస్తుంది. ఈ విధంగా మూడ్ ఆఫ్ ది నేషన్ అనే దాంట్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి. ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. అని ఒక అంచనాకు వస్తుంది.


అదేవిధంగా 2018లో ఎన్డీఏకు 233 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ 350 పైగా సీట్లతో ఎన్డీఏ దేశంలో అధికారంలోకి వచ్చింది. యూపీఏకు 250 సీట్లు వరకు వస్తుంది అని చెబితే 90 సీట్లకే పరిమితమైంది. ఈ విధంగా అంచనాలను అందుకోలేని విధంగా ఇండియా టుడే సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రజల నాడిని తెలుసుకొని సరైన విధంగా చెప్పలేక పోతుంది.


ఒక రకంగా చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఇండియా టుడే సర్వే నిర్వహిస్తూ బిజెపి ఓడిపోతుందని పరోక్షంగా చెబుతుందన్న విమర్శలు ఉన్నాయి. తద్వారా సరైన విధానాన్ని ప్రకటించలేక పోతుందంటున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీలతో కూడిన యూపీఏ కు 200 సీట్లపైగా వస్తాయని చెప్పింది. దాంట్లో కేవలం యుపిఏ లోని ప్రధాన భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్‌కు  155 ఎంపీ సీట్లు వచ్చాయి.


ఈ విధంగా సరైన ఫలితాలు చెప్పలేకపోతోంది. 2018 కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం ఫలితాలను చాలా దూరంగా చెప్పింది. బిజెపికి 80 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని కాంగ్రెస్‌కు 105 వస్తాయని చెప్పింది. కానీ అక్కడ బిజెపి 104 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 80 జేడియుకు 37 స్థానాలు వచ్చాయి. మొత్తం మీద చూస్తే ఇండియా టుడే సర్వేలు ఫలితాలకు చాలా దూరంగా ఉంటున్నాయని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: