ముస్లిం రాజ్య స్థాపన చేయాలన్నది పాకిస్థాన్ ఆకాంక్ష. కానీ ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్న పాకిస్థాన్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మత రాజ్యం కోసం తమ ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లో, ప్రార్థన మందిరాల్లో దాడులు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లోని మసీదులో జరిగిన దాడిలో చాలా మంది చనిపోయారు. తెహ్రీక్ -ఏ - తాలిబాన్ల సంస్థ మేమే దాడి చేశామని ఒప్పుకున్నారు.


పాకిస్థాన్ దేశం మత రాజ్య స్థాపనకు క్రిస్టియన్ దేశాల జోలికి పోతే ఉరికించి కొడతారు. కాబట్టి ముందుగా హిందు దేశాలను టార్గెట్ చేసుకుని అక్కడ వీలైనంత మేరకు దాడులు చేయడం, మత మార్పిడులు చేయడం లాంటి కార్యక్రమాలను విరివిగా చేపట్టేది. ముఖ్యంగా జిహాద్ లాంటి నినాదంతో పేద అమాయక ముస్లిం యువతను పక్కదారి పట్టించడంలో పాక్ చాలా వరకు సక్సెస్ అయింది.


రెగ్యూలర్ గా ప్రార్థనలు చేసే మసీదుల్లో కూడా దాడులు చేయడం మొదలు పెట్టారు. మక్కా మసీదుల్లో దాడులు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో మసీదులనే టార్గెట్ గా చేసుకుని ఎక్కువ మంది ప్రాణాలను తీసే విధంగా తెహ్రీక్ -ఏ-తాలిబాన్ సంస్థ పని చేస్తుంది. వీరితో అనవసరంగా చర్చలు జరిపామని వీరి విషయంలో కాస్త కఠినంగానే ఉంటే సరిపోయేదని పాకిస్థాన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతోంది. అంటే మతరాజ్యం కోసం తమ ప్రార్థన మందిరాలను పేల్చేయడం.. అందులోని అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడం లాంటి చర్యలు ఏ మతంలో చెప్పాయో అర్థం మాత్రం కాదు.


దీంతో పాకిస్థాన్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. పాకిస్థాన్ మంత్రి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. తెహ్రీక్-ఏ-తాలిబాన్లను క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే వారు చేస్తున్న పని అత్యంత నీచమైనది. వారితో గతంలో చర్చలు జరపడమన్నది మేం చేసిన పెద్ద తప్పు. వారిని మాత్రం విడిచి పెట్టమంటూ పాకిస్థాన్ కు చెందిన మంత్రి ఒకరు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: