ఈ నెల 24 వస్తే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాది అవుతోంది. అయినా ఏ మాత్రం రష్యా జీడీపీ పడిపోలేదు. ప్రస్తుతం అమెరికాతో పోటీ పడే స్థితికి చేరుకుంది. యూరప్ దేశాలు మాత్రం అత్యాధునిక ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను ఉక్రెయిన్ కు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యర్థిని ఛేదించే ట్యాంకులను ఇవ్వనున్నాయి.


ఇన్ని రోజులవుతున్నా రష్యా వద్ద ఉన్న ఆయుధాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో అమెరికా, యూరప్ దేశాలకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని రష్యాలోని ఆయుధ కంపెనీలో మరింత వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. యుద్ధ రంగంలో ఏ మాత్రం తగ్గేది లేదంటూనే వివిధ దేశాలకు సరఫరా చేసే స్థాయిలో ఉండటం గమనార్హం.


అయితే ఉక్రెయిన్ లోని క్రిమియాను 2014 లో రష్యా ఆక్రమించుకున్నపుడు కూడా అమెరికా, యూరప్ దేశాలు ఇదే దోరణిని ప్రదర్శించాయి. మళ్లీ ఇప్పుడు కూడా ఉక్రెయిన్ కు ఆశలు రేపి మధ్యలోనే చేతులెత్తేసే లాగా కనిపిస్తోంది. ఇప్పటికే డొనెట్క్స, జెపో జజరియా, కేర్సన్ ప్రాంతాల్లో రష్యా బలగాలు తిష్ట వేశాయి.


ఈ సమయంలో అమెరికా తెర వెనక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నాయి. కీవ్ జోలికి పోకూడదని అమెరికా, రష్యాతో రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు, స్విస్, జర్మన్ పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీన్ని మాస్కో తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమించుకున్న భూ భాగాల్లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఉంచుకుని కీవ్ జోలికి రాకూడదన్నది, యుద్ధాన్ని ముగించాలని వైట్ హౌస్ చెప్పినట్లు కథనాలు రావడం జరిగింది. మొత్తం మీద చివరి వరకు మీకు అండగా ఉంటామని చెప్పి ఉక్రెయిన్ ను నడి సముద్రంలో విడిచి పెట్టినట్లు చేస్తుంది అమెరికా. రష్యన్లు కీవ్ ను విడిచిపెడతారా? లేక దాన్ని కూడా ముట్టడిస్తారా త్వరలోనే తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: