
ఎప్పుడు భారత్ ను ఎలా దెబ్బకొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు అమెరికా ప్రస్తుతం తన వద్ద డ్రోన్లను భారత్ కు ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై అజిత్ దోవల్ తో చర్చలు కూడా జరిపారు. ఎన్ క్యూ 9పీ ప్రీడియేటర్ డ్రోన్లను ఇవ్వాలని అమెరికా అనుకుంటోంది. దీనికి 3 బిలియన్ డాలర్ల మేరకు ఖర్చవుతాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వర్టైజర్ అజిత్ దోవల్ 2017 లో యూఎస్ లో పర్యటించినపుడు దీని గురించి ఒప్పందం జరిగింది. ఇందులో 30 డ్రోన్ల వరకు అందివ్వనున్నారు.
ఇవి భారత్, చైనా వాస్తవాధీన రేఖ వద్ద, హిందూ మహా సముద్ర ప్రాంతంలో గస్తీ కాసేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కానీ ఇంత వరకు వాటిని అందివ్వలేదు. మరి అమెరికా అన్న మాట ప్రకారం 30 డ్రోన్లు భారత్ కు అందితే రక్షణ పరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం చైనాను దెబ్బకొట్టాలని చూస్తున్న అమెరికా ఏ చిన్న అవకాశం వచ్చిన దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.