
తాజాగా రొమేనియా అధ్యక్షుడు ప్రపంచంలోనే తొలిసారిగా అయాన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని తనకు సలహాదారుడుగా పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు కూడా. దీని ముఖ్యమైన పని ఏంటంటే పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో వచ్చే కంప్లైంట్స్ ని ప్రధాని వరకు చేరవేయడం. దీని వర్కింగ్ కోసం వాయిస్ అసిస్టెంట్ ని వాడుతారు.
స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, అలెక్సా ఇలా ఈ సీరియల్ తరహాలోనే వాయిస్ అసిస్టెంట్ ని అక్కడ దానికి అరేంజ్ చేశారు. దాంతో అయాన్ అనే ఈ సలహాదారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జనాల దగ్గర కంప్లైంట్లు రిసీవ్ చేసుకుని వాటిలో నుండి జనాలు ఎక్కువగా ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి అందరికీ కామన్ గా వచ్చే, ఎక్కువగా వచ్చే సమస్య ఏంటి అనేది క్లాసిఫై చేసి ప్రధానమంత్రి కి అది నివేదికను పంపిస్తుంది.
గతంలో లేదా లేదా ప్రస్తుతం 1100, 14400, ఇలా వీటిలో ఒక వ్యక్తి వారి పై అధికారికి సమాచారాన్ని అందిస్తే, ఆ పై అధికారి ఆయన పై అధికారికి, అలా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లేసరికి పని ఆలస్యం అనేది అవుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా అంతా అల్గారిధం ద్వారా, ఏ ఏ అంశాలు ప్రజల దగ్గర నుండి ఎక్కువగా వచ్చాయో వాటిని అల్గారిధం ద్వారా సెపరేట్ చేసి, ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చాయో కూడా ఫిల్టర్ చేసి మరీ అది కూడా తక్కువ సమయంలోనే ఇదంతా పని పూర్తి చేసి ప్రధానమంత్రి కి పంపడం జరుగుతుంది.