
ఓవరాల్ గా టీచర్ ఎమ్మెల్సీ రెండు స్థానాలు గెలుచుకోవడంతో వైసీపీకి బలం చేకూరింది. మొన్నటి వరకు టీచర్లు తమ పార్టీకి ప్రభుత్వ ఉద్యోగుల్లో అనుకూలత లేదని చెప్పిన వారికి ఓట్ల రూపంలో తగిన విధంగా బుద్ది చెప్పారని వైసీపీ భావిస్తోంది.
తూర్పు రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల రూపంలో 1055 ఓట్ల ఆధిక్యంతో పీడీఎఫ్ అభ్యర్థి బాబుల్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. మరో స్థానంలో అనంతపురం, కర్నూలు జిల్లా టీచర్ల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఓంటెరు శ్రీనివాసులు మీద గెలుపొందారు. 169 ఓట్ల తేడాతో గెలవడం సాధ్యమైంది.
టీడీపీ చేసిన ప్రచారం చూస్తే వైసీపీ ప్రభుత్వానికి ఒక్క టీచర్ కూడా ఓటు వేయరని చెప్పారు. కానీ వైసీపీ కి టీచర్ల మద్దతు ఉందని ఈ రెండు విజయాలతో తేలిపోయింది. మొన్నటి వరకు వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని టీడీపీ, దాని అనుకూల మీడియా విష ప్రచారం చేసింది. ఇలాంటి ప్రచారం వల్ల నిజంగానే ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఉన్నదా అని అనిపించింది. మొత్తంగా రెండు స్థానాల్లో వైసీపీకి ఓటమి తప్పదని అనిపించింది. కానీ అనుహ్యంగా రెండో ప్రాధాన్య ఓట్ల రూపంలో వైసీపీ గెలుపు బావుటా ఎగరేసింది. దీని వల్ల రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకత ఎక్కువగా లేనట్లు తెలుస్తోంది. ఈ గెలుపు వల్ల వైసీపీ పార్టీకి మరింత బలం చేకూరినట్లయింది.