ప్రపంచ శాంతి బహుమతి నరేంద్ర మోదీకి వచ్చేస్తోందని బీజేపీ లీడర్లు ఇప్పుడే సంబరాలు చేసేసుకుంటున్నారు. అక్కడక్కడ ప్రదర్శనలు, ర్యాలీలు కూడా చేస్తున్నారు. నోబెల్ ప్రైజ్ విన్నర్ ని ప్రకటించే అస్లే తోజే నరేంద్ర మోదీ నోబెల్ ప్రైజ్ రేసులో ఉన్నారని అన్నారు. ఆయన మోస్ట్ ట్రస్టు లీడర్ అని అన్నారు. ప్రపంచంలో జరిగే యుద్ధాలను ఆపడంలో మోదీ తర్వాతే ఎవరైనా అన్నారు. మోదీ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు. పుతిన్ లాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి యుద్ధాన్ని ఆపాలని కోరారు. శాంతి కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తుల్లో మోదీ ముందున్నారని అన్నారు.


భారతదేశాన్ని శాంతియుతంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు  చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ శాంతిని కోరుకునే వారు ప్రపంచంలో లేరని ఆయన అన్నారు. అస్లే తోజే కేవలం నోబెల్ ప్రైజ్ ఇచ్చే టీం లో కీలకమైన వ్యక్తి మాత్రమే. ఈయనకు కాస్త మోదీ అంటే అభిమానం.నోబెల్ ప్రైజ్ కమిటీ మోదీ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముందుగా బీజేపీ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అంశం నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలంటే ఏం అర్హతలు ఉండాలి. శాంతి కోసం ఎలాంటి పనులు చేశారు. ఎన్ని దేశాల్లో శాంతియుత కార్యక్రమాలు నిర్వహించారు. అన్నింటిని పరిగణలోకి తీసుకుని కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.


భారత్ లో  కైలాస్ సత్యార్థ్ కు నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన పేద చిన్నారులకు ఉచితంగా విద్యను అందిస్తున్న కారణంగా నోబెల్ ప్రైజ్ విద్యా విభాగంలో  దక్కింది. అలాగే మథర్ థెరిస్సా, వెంకటరామన్ రామకృష్ణన్, అమర్త్య సేన్, సుబ్రమణ్యం చంద్రశేఖరన్, సీవీ రామన్, రవీంద్ర నాథ్ ఠాగూర్, అభిజిత్ బెనర్జీ, హర గోవింద్ ఖురానా భారత్ నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. వీరు విద్య, వైద్యం, ఫిజిక్స్, శాంతి, ఎకానమిక్స్ విభాగాల్లో అందరికంటే ప్రత్యేకంగా చేసిన పనులను గుర్తించిన నోబెల్ కమిటీ వీరికి నోబెల్ ప్రైజ్ ను ఆయా సంవత్సరాల్లో ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: