పేదవాడికి అండగా నిలబడే పనిచేస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. పేదవాడికి ఏదైనా అనారోగ్యం వస్తే, డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కే వెళ్తాడు. చాలామంది మనలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి వైద్య సేవ కోసం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వం ప్రకారం అప్పో,సొప్పో చేసుకుని మరీ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. కానీ పేదలకు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే మెయిన్ ఆప్షన్.


ప్రైవేట్ హాస్పిటల్లో భారీ ఖర్చులతో కూడిన పరిస్థితులను చూస్తూ దాంట్లో ట్రీట్మెంట్ ఇప్పించలేక అనారోగ్యాలు ముదిరి ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్లు దశాబ్దాలుగా ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి పొజిషన్ నుండి వాళ్లకు వరంగా కార్పొరేట్ వైద్యాన్ని పేదోడికి అందించిన ఆరోగ్యశ్రీ కి ఖచ్చితంగా హాట్సాఫ్ చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ ఆరోగ్యశ్రీ పథకం కేంద్ర స్థాయికి వెళ్లి, జాతీయ స్థాయిలోకి కూడా వెళ్లింది ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో.


 ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్యశ్రీ పథకం అంటే ఆయుష్మాన్ భారత్ పథకమే ఇప్పుడు. కేంద్రం డబ్బులతోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది నడుస్తుంది. ఈ ఆరోగ్య శ్రీ విధానంలో 70-80% ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. 20 శాతం మాత్రమే పేదలు ఖర్చు పెడుతున్నారు. అలాంటి ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే 22 కోట్ల మంది ఆయుష్ భారత్ ఖాతాలను తీసుకున్నారని తెలుస్తుంది.


52 వేల 23 కోట్ల విలువైన చికిత్స ని అందించారు ఇప్పటివరకు. 22 వేల 424 హాస్పిటల్స్ ఆయుష్ భారత్ కింద పని చేస్తున్నాయి. 4.36 కోట్ల మంది రోగులు దీని ద్వారా లబ్ధి పొందారు. కష్టం కమ్ముకు వచ్చిన టైంలో విద్య, వైద్య ఈ  రెండింటికీ అయ్యే ఖర్చు ఒక సామాన్యుడికి సంబంధించిన అతి పెద్ద ఖర్చు. అందులో ఇప్పుడు వైద్యానికి సంబంధించినటువంటి కీలకమైన పనిని కేంద్రం చేస్తూ ఉండడం హర్షణీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: