
కానీ అలుపెరగక పోరాడుతున్న రష్యాని చూసి వాళ్లకి ఇప్పుడు చెమటలు పడుతున్నాయని తెలుస్తుంది. మరి రష్యాకు నిరంతరాయంగా ఆయుధాలు ఎవరిస్తున్నారనే ప్రశ్న వచ్చింది ఆ దేశాలకు. దానికి సమాధానంగా ఇరాన్, చైనా, నార్త్ కొరియా దేశాల పేర్లు చెప్పింది రష్యా. ఈ వ్యాఖ్యలను ఆయా దేశాలు ఖండించాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా మొన్నటి వరకు తనకు మిత్రుడుగా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా నుండి కూడా వస్తున్నాయని అమెరికా చెప్తుంది.
దాన్ని రష్యా తోసిపుచ్చింది. తనతో యుద్ధం చేసే ఉక్రెయిన్ కు తనని నాశనం చేయడానికి అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు ఇస్తూ సహకరిస్తున్నాయని చెప్తుంది. తాజాగా ఒక కమర్షియల్ నౌక ద్వారా అనేక ఆయుధాలను కొనుగోలు చేసిందట రష్యా. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా నుండి ఆయుధాలను తీసుకెళ్లిపోతుందంటూ సౌత్ ఆఫ్రికాలో ఉన్న అమెరికా రాయబారి ఇప్పుడు తాజాగా చెప్పుకొచ్చారట.
దాంతో కోపంతో రగిలిపోయిన రష్యా మంత్రి సర్గేయ్ లేవ్రో మైండ్ యువర్ వర్డ్స్ నీ పని నువ్వు చూసుకో అంటూ సౌత్ ఆఫ్రికాలో ఉన్న అమెరికా రాయబారికి వార్నింగ్ ఇచ్చాడట. పక్క వాడిని పతనం చేయడానికే ఎప్పుడూ ఆలోచించే అమెరికా ఆయుధాల కోసం చాలా దేశాలపై దాడి చేసింది ఇప్పటి వరకు. ఇప్పుడు రష్యా దగ్గర సొంతంగా ఆయుధాలు లేకపోయినప్పటికీ ఏదో ఒక దేశం నుండి తెప్పించుకుంటూ తన ఆయుధాగారాన్ని నిండుగా నింపుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా యుద్ధ కన్ను రష్యాపై పడిందని తెలుస్తుంది.