పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న జనం భారత్ కు వచ్చేయాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు స్వతంత్ర కాశ్మీర్ కు మద్దతు ఇస్తున్నట్లు కల్లబొల్లి మాటలు చెప్పిన పాక్ ఇప్పుడు అక్కడ జనాభా లెక్కల కోసం చేస్తున్న సమయంలో వారిని పాక్ పౌరులుగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఒప్పుకోవడం లేదు. దీంతో అక్కడ ఉంటే పాక్ అక్రమిత కాశ్మీర్ కు చెందిన నాయకులకు పాక్ లోకి తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొంతమందిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి తీసుకువచ్చి అక్కడ ఉంచేస్తున్నారు. దీంతో ఎవరైతే స్వతంత్ర కాశ్మీర్ అంటున్నారో వారి నోర్లను మూయించేస్తున్నారు.


చైనాలోని వీగర్ ముస్లింలు ఆ మధ్య అల్లర్లు చేసినపుడు జిన్ పింగ్ ఇలాంటి పనే చేశారు. అక్కడకు చైనాలోని కొంతమంది జనాన్ని ఆ ప్రాంతానికి పంపించి ముస్లింలు ఆందోళన చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. రెండు పూటల అక్కడి ప్రజలకు తిండి పెట్టలేని పాకిస్థాన్ నాయకత్వానికి పాక్ అక్రమిత కాశ్మీర్ కావాలా అని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే రోజులు కూడా త్వరలోనే వస్తాయని అన్నారు.


ఆ సమయంలో ఎవరూ ఏమీ చెప్పినా వినే ప్రసక్తే ఉండదని అన్నారు. ఇండియాలోని కాశ్మీర్ లో ఆర్టికల్ 370, రద్దు తర్వాత పాక్ కావాలనే కాశ్మీర్ పౌరులను రెచ్చగొట్టింది. అయినా కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ.. కాశ్మీర్ ను ఎప్పటికీ ఇండియాదే దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దానీ కోసం ప్రాణాలైనా ఇస్తాం అని లోక్ సభలో అనడంతో బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది తెలిసి వచ్చింది. కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు కూడా ఇండియా వైపు చూడటం అనేది సానుకూల అంశమేనని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

POK