రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో టిడిపి అలాగే వైసీపీ మధ్య  విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఒకరు ఒక రాజధాని కావాలని కోరుకుంటే, మరొకరు మరొక రాజధాని కావాలని కోరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఉండాలని మొదటి నుంచి పట్టుబడుతుంది. అంతే కాకుండా అక్కడ రైతులు, ప్రజా సంఘాలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని ఆందోళనలు కూడా చేశారు.


అయితే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమరావతి ఆంధ్ర రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని భావిస్తుంది. అమరావతి, విశాఖ, కర్నూల్ ఈ మూడు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులుగా ప్రతిపాదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం  అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా అనుకున్నారు.


అలాగే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనుకోవడం జరిగింది. అంతే కాకుండా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలును జ్యుడిషియల్ రాజధానిగా చేయాలని భావించింది ఆ పార్టీ. అయితే విశాఖను రాజధానిగా చేయడం గురించి రాయలసీమ వైఎస్ఆర్సిపి నాయకులు పెదవి విరుస్తున్నారని అంటున్నారు. దగ్గరలో అంటే గుంటూరు లేదా విజయవాడ లను  రాజధానులుగా పెడితే గనుక తమకు కూడా కొంత సంపాదించుకోవడానికి వీలు ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు.


అయితే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం దసరా నుండి  విశాఖలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసి తమ వాళ్ళు బాగుపడడానికి రంగం సిద్ధం చేశారు. అయితే  వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చేసరికి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుని ఎక్స్టెండ్ చేసి అందరూ బాగుపడడానికి చేసుకువచ్చారు ఆయన.  చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల  సరసన విశాఖను కూడా నిలపడానికి జగన్ కృషి చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, డేటా సెంటర్లు, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు, బడా పెట్టుబడిదారులు అందరూ విశాఖ వైపే దృష్టిని కేంద్రీకరించారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: