సార్వత్రిక పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాజకీయ నాయకులు తమ ఆఖరి ప్రయత్నాలను షురూ చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఈ సమయంలో గెలుపుపై ఎవరి ధీమా వారిలో కనిపిస్తూ ఉంది. ప్రచార సభలకు జనాలు భారీగా తరలి వస్తున్నా.. అవి ఓట్లుగా మారతాయా అనే సందేహం ఆయా పార్టీల్లో నెలకొంది.


మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఈ నెల 13న పోలింగ్ జరిగితే, ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. అంటే పోలింగ్ అయ్యాక 21 రోజుల పాటు సస్పెన్స్ కొనసాగనుంది.  రాష్ట్రంలో కూటమి వర్సెస్ వైసీపీ ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు తనకు అనుకూల పవనాలు వీచాలనే ఉద్దేశంతో రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తుంటారు.


గతంలో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పసుపు కుంకం పేరిట మహిళల ఖాతాలో రూ.10 వేలను జమ చేశారు. దీంతో మహిళలంతా తమ వెంటే ఉన్నారని.. ఇక జగన్ పని అయిపోయిందని ఒక తరహా ప్రచారానికి తెర తీశారు. మరోవైపు మహిళలు కూడా ఆరు గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ బూత్ ల దగ్గరకి వచ్చేశారు. ఇంకేముంది వీరంతా టీడీపీకి ఓటేయ్యడానికే వచ్చారు. పసుపు కుంకం పథకం పనిచేసింది అని టీడీపీ నేతలు తెగ సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే.. 23 సీట్లకు టీడీపీ పరిమితం అయింది. 151 సీట్లతో వైసీపీ అఖండ విజయం సాధించింది.


ఇప్పుడు చూస్తే.. ఈ సారి ఉద్యోగులను వాడుకొని తమకు అనుకూల వాతావరణం సృష్టించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఒక మౌత్ టాక్ ఇక టీడీపీ వచ్చేస్తుంది అనే భావన తటస్థ ఓటర్లలో కలిగిస్తే.. అవి తమ వైపు టర్న్ అవుతాయి అనేది టీడీపీ వ్యూహం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయి. ఇక వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైనట్లే అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరీ ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: