ఏపీలో తీవ్ర వివాదస్పదమైన, రాజకీయాల్లో పెను దూమారం రేపిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనిపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది.


అయితే దీనిపై నీతి ఆయోగ్ వైసీపీకి అనుకూల ప్రకటన చేసినా.. ఆంధ్ర జ్యోతికి నెగిటివ్ గానే కనిపించింది. అసలు ఏం జరిగింది అంటే… నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు.. తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు  ఆ సంస్థ బదులిస్తూ.. మా దగ్గర ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. రైతుల భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలా అనే ప్రశ్నకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏముందో మాకు తెలియదు అని .. దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం మా వద్ద లేదని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది.


దీంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టైటిలింగ్ యాక్ట్ చట్టం  అమలుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అనే ప్రశ్నకు మేం భూ వనరుల విభాగంతో పాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను మాత్రమే పంపించాం అని పేర్కొంది.


ఇంత వరకు బాగానే ఉన్నా ఆంధ్రజ్యోతి మాత్రం ఈ చట్టం ముసుగు తొలిగిపోయింది. దీనికి కర్త, కర్మ, క్రియ రాష్ట్ర ప్రభుత్వమే అని.. వైసీపీ పెద్దలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ కథనం ప్రచురించింది. మనం ఒక్కసారి నీతి ఆయోగ్ చెప్పిన విషయాలు పరిశీలిస్తే.. ఏపీ చట్టంలో ఏముందో మాకు తెలియదు అని చెప్పింది. అంతేకానీ భూములు అమ్ముకోవాలంటే రాష్ట్రం అనుమతి తప్పనిసరి అని చెప్పలేదు. మరోవైపు ముసాయిదా పంపించారు అంటే దానిలోని పరిమితులకు లోబడే చట్టాన్ని చేస్తారు అని కదా అర్థం. ముసాయిదాను ఉల్లంఘిస్తే కేంద్రం, సుప్రీం ఆక్షేపించదా.  కానీ వీటిని వక్రీకరిస్తూ.. తమకు అనుకూలంగా మార్చుకొని అందమైన అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: