
తల్లికి వందనం పథకం కింద ఒకే రోజు 67.25 లక్షల మంది విద్యార్థులకు 10 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఖజానా ఖాళీ అయినప్పటికీ తమ ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చే సంస్కృతి తమది కాదని, అందరికీ సమానంగా ప్రయోజనాలు అందిస్తామని వివరించారు. ఈ పథకం విద్యార్థులకు ఉత్సవ వాతావరణాన్ని సృష్టించిందని అన్నారు.
రాష్ట్రంలో 64 లక్షల మందికి నెలకు 4 వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నామని, ఏడాదికి 34 వేల కోట్ల రూపాయలు ఈ పథకం కోసం వెచ్చిస్తున్నామని నారాయణ తెలిపారు. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఆగస్టు నుంచి ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. 2.25 లక్షల మందికి అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అమృత్ పథకం నిధులను వినియోగించకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు