
వైసీపీ ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ, ఒక్కరికి మాత్రమే 13 వేల రూపాయలు అందించారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో జగన్, భారతిరెడ్డి ఇద్దరు పిల్లలకు 30 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఆ మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. జగన్ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేరని స్థితిలో, వైసీపీ నాయకులు తల్లికి వందనం పథకంపై విమర్శలు చేసే అర్హత లేదని ఆయన తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చడమే కాక, విద్యా రంగంలో సంస్కరణలకు బాటలు వేస్తోందని పేర్కొన్నారు.
జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, విధ్వంస పాలన సాగించారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అయినప్పటికీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని, సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నామని వివరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు