కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు భరోసా ఇస్తూ మాట్లాడారు. ఏభై ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తోందని చెప్పారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత తమదని ఉద్ఘాటించారు. వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేశామని గర్వంగా తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు కూడా మహిళల ఆధీనంలోకి వచ్చాయని వివరించారు.అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయికి మహిళలను తీర్చిదిద్దుతున్నామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు నూట యాభై దుకాణాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ ఉత్పత్తులు అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో అమ్ముడవుతాయని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని హామీ ఇచ్చారు. ఈ చర్యలు మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.జీవితాల్లో నిజమైన మార్పు కావాలంటే పిల్లలను చదివించాలని రేవంత్ రెడ్డి సూచించారు. విద్యే మహిళలు, కుటుంబాలు ఎదిగే మార్గమని ఉద్ఘాటించారు.

కొడంగల్ ప్రాంతంలో మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు మహిళలకు చేరుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వరాలు కాంగ్రెస్‌కు ఓట్లుగా మారతాయని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలకు మద్దతు ఇస్తారని రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్‌లో మహిళల సమావేశంలో ఆయన చేసిన ప్రకటనలు రాజకీయంగా కీలకమవుతాయని అంచనా వేస్తున్నారు. మహిళా ఓటర్లు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని పార్టీ ఆశాకిరణం కాంటుంది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: