ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇరవై పారిశ్రామిక వాడల్లోని ఈ భూములను అపార్ట్‌మెంట్లు కడతామని చెప్పి పూర్తిగా ప్రైవేటు లాభాలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రిడ్ పాలసీలో యాభై శాతం ఐటీ కార్యాలయాలకు మిగతా యాభై శాతం ఇతర అవసరాలకు వినియోగించేలా ఫీజులు చెల్లించి అనుమతి ఇచ్చామని కేటీఆర్ వివరించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ విలువలో ముప్పై శాతం చెల్లిస్తే చాలని అప్పనంగా భూములు ఇచ్చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి తన మనవడు మునిమనవడు వరకు కావాల్సినంత డబ్బు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రేవంత్ రెడ్డి ఒక్క పాలసీతోనే అంబానీ రేంజ్‌కు చేరుకోవాలని కలలు కంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ భూములు ప్రజల ఉపాధికి పరిశ్రమలకు కేటాయించగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఈ పాలసీ రాష్ట్రానికి భారీ నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఈ ఆరోపణలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బీఆర్ఎస్ నాయకులు ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కారుపై అవినీతి ముద్ర పడినట్టు కనిపిస్తోంది. ప్రజలు ఈ భూదందాకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి