చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే సొంత గొప్పలు చెప్పుకునేందుకు సమ్మిట్లు అవసరమా అని ప్రశ్నించారు.రేవంత్ సర్కారు హైడ్రా పేరుతో ప్రజలను మోసం చేసిందని లక్ష్మణ్ ఆరోపించారు. రెండేళ్లలో భూ మాఫియా పడగలు ఎత్తేసిందని చెప్పారు. మంత్రుల మధ్య వాటాల పంపకంపై గొడవలు బయటపడుతున్నాయని వెల్లడించారు.
పగటిపూట పోలీసు అధికారులపై కాల్పులు జరిగే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాఫియా కల్చర్ గన్ కల్చర్‌గా మారి తెలంగాణ రైజింగ్ అవుతోందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం తీవ్రవాదం పెరిగిపోతున్నాయని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని చెప్పారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పును మరింత పెంచుతోందని ఆరోపించారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో పెట్టుబడులు తెస్తామంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలో ఇలాంటి ప్రచార కార్యక్రమాలు అనవసరమని విమర్శించారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి