ఈ ప్రశంసలు రాష్ట్ర రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం వెనుక ఆసక్తికర కథ ఉంది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తనను ఈ పదవికి ఆహ్వానించారని ఆనంద్ మహీంద్ర వెల్లడించారు. టెక్ మహీంద్ర యూనివర్సిటీకి ఇప్పటికే ఛైర్మన్‌గా ఉన్నందున మొదట తిరస్కరించానని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి లక్ష్యాలు, విజన్ వివరించిన తర్వాత కాదనలేకపోయ్యానని ఆయన ఒప్పుకున్నారు.
ఈ యూనివర్సిటీ కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత్ అవసరాలను కూడా తీర్చగలదని ఆనంద్ మహీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ బాధ్యతను స్వీకరించడం ద్వారా మహీంద్రా గ్రూప్ తెలంగాణతో మరింత దృఢంగా కలిసి పనిచేయనుంది.తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ప్రజల కేంద్రీకృత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని ఆనంద్ మహీంద్ర పునరుద్ఘాటించారు. స్కిల్ డెవలప్‌మెంట్, యువత సాధికారత, టెక్నాలజీ ఇన్నోవేషన్‌లను ప్రోత్సహించేలా రూపొందిందని కొనియాడారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి లక్ష్యాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ఆహ్వానం తిరస్కరించలేకపోవడం వెనుక ఈ దార్శనికతే కారణమని స్పష్టమవుతోంది. ఈ భాగస్వామ్యం రాష్ట్రానికి కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు అంచనా.మహీంద్రా గ్రూప్ 2047 లక్ష్యాల సాధనలో తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తుందని ఆనంద్ మహీంద్ర హామీ ఇచ్చారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి