కల్వకుంట్ల కవిత రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ బహిరంగంగా ప్రకటించారు. దేవుడి దయతో తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని అన్యాయాలను, అక్రమాలను వెలికి తీస్తానని కవిత హామీ ఇచ్చారు. గత కొన్ని వారాలుగా ఆమె కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్‌లపై నిరంతరం ఆరోపణలు చేస్తూ రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాననే ప్రకటనతో ఆమె రాజకీయ లక్ష్యం స్పష్టమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ మాటలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఆమెకు స్థానం లేకపోయినా, స్వతంత్రంగా లేదా కొత్త పార్టీ పెట్టి పోటీ చేసే అవకాసం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అనుభవం, తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ఆమెకు బలమైన బ్యాక్‌గ్రౌండ్‌గా నిలుస్తున్నాయి.కవిత ప్రకటన వెనుక రాజకీయ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబంలోనే విభేదాలు బయటపడుతున్న నేపథ్యంలో, ఆమె సొంతంగా రంగంలోకి దిగే సూచనలు ఇస్తున్నారు.

ఇప్పటికే ఆమె భర్తపై జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, భూ కబ్జాలపై నిరంతర విమర్శలు చేస్తూ పార్టీ పెద్దలను ఇరకాటంలో పెడుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గానీ, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గానీ కవిత కొత్త పార్టీతో బరిలోకి దిగితే ఆసక్తికర పోరు జరుగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు గురిపెట్టడం ద్వారా మూడో పక్షంగా ఆవిర్భవించే అవకాశం ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని భూ లావాదేవీలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీలను వెలికి తీస్తానని కవిత హెచ్చరించారు. ఇప్పటికే కోకాపేట చెరువు కబ్జా, హిల్ట్ పాలసీ వంటి అంశాలను బయటపెడుతూ రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారు. ఆమె మాటల్లో గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వమో ఎవరూ తప్పించుకోలేరనే ధీమా కనిపిస్తోంది. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా కవిత ఆవిర్భవించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

దేవుడి దయతో ముఖ్యమంత్రి అవుతాననే కవిత ప్రకటన రాజకీయ వర్గాలను కదిలించింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకీయం మరింత బలపడిందని అనిపిస్తోంది. రానున్న రోజుల్లో కవిత సొంత పార్టీ పెట్టి, మహిళలు, యువత మద్దతుతో రంగంలోకి దిగితే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఆమె ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో భారీ చర్చను రేకెత్తించింది. కవిత లక్ష్యం నెరవేరుతుందేమో చూడాలి.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: