భట్టి ఈ విషయాన్ని తీసుకుని కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడని సెటైర్ వేశారు. సీఎం పదవి మీద వ్యామోహం తప్ప ప్రజల క్షేమం గురించి పట్టదని ఆరోపించారు. బీఆర్ఎస్ రెండుసార్లు అధికారం పొంది ఇష్టారాజ్యంగా దోచుకుందని చెప్పారు. రెండు పడకగదుల ఇల్లు అని పదేళ్లు సొల్లు చెప్పి గ్రామాల్లో ఒక్క పేదవానికి కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ దొరల ప్రభుత్వమని ఇప్పుడు పేదల ప్రభుత్వమని వివరించారు. రైతులకు ఒకే విడతలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. కవిత లేఖలో కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ను విమర్శించడం పార్టీలో లోపాలు పేర్కొనడం జరిగింది.
ఆమెను సస్పెండ్ చేయడం కుటుంబంలో విభేదాలను బయటపెట్టింది. భట్టి ఈ అంశాన్ని తీసుకుని కేసీఆర్ రాష్ట్రానికి న్యాయం చేయలేడని ఆరోపించారు. కవిత తన బంధువులు హరీష్ రావు సంతోష్ కుమార్ ను విమర్శించింది. కలేశ్వరం ప్రాజెక్ట్ లో ఆమె తండ్రి పేరు మసకబారిందని చెప్పింది. ఈ వ్యాఖ్యలు పార్టీలో గందరగోళం సృష్టించాయి. భట్టి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి