వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రైమరీ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లాంటి పోస్టుల భర్తీకి ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత వెబ్ సైట్ పొందుపరిచారు.