పరీక్షల్లో మరో కీలక మార్పునకు సంబంధించిన వివరాలను విద్యా శాఖ మండలి అధికారులు తెలిపారు. వంద మార్కుల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించి మరో 20 మార్కులను ఇంటర్నల్ పరీక్షల నుంచి తీసుకుని కలిపేవారు. ఇప్పుడు ఈ ఏడాదికి ఆ విధానాన్ని రద్దు చేశారు. పూర్తిగా 100 మార్కులకు పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ విషయం పై పలు చర్చలు జరిపి ఏపి విద్యా శాఖ మండలి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మార్కువి 12 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, రెండు మార్కుల అతి స్వల్ప ప్రశ్నలు 8, నాలుగు మార్కుల స్వల్ప సమాధాన ప్రశ్నలు 8, ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5 ఉండనున్నాయి. అంతేకాదు రెండు గంటలలోపే ఈ పరీక్షలను రాయాల్సి ఉంటుంది.