తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో శాసనసభలోనే ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు ఈ విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ బడ్జెట్ ను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక, ప్రణాళిక శాఖకు బడ్జెట్లో రూ. 45,923 కోట్లను నిర్దేశించారు.