తెలంగాణ విద్యార్థులకు , నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. గత ఏడాది నుంచి వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి శుభవార్త చెప్పింది. తెలంగాణలో త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం తెలంగాణ శాసనసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.