కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో), కోల్‌కతాలోని ఐకార్ సెంట్రల్ ఇన్ లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని పూర్తి వివరాలు చూసి అందులో మీకు సరిపోయే, ఆ పోస్ట్ లకు సంబంధించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని పొందండి. ఇక ఆ ఉద్యోగాల పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ పొందండి...

 

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లో నాన్ అకడమిక్ పోస్టులు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ గల ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 10 పోస్టులు. ఇక ఇందులో రిజిస్ట్రార్‌‌ (స్టూడెంట్ ఎవాల్యూయేషన్ డివిజన్‌), డైరెక్టర్ ‌‌(కంప్యూటర్ డివిజన్‌), డిప్యూటీ రిజిస్ట్రార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌‌. వీటికి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్‌ విషయానికి వస్తే షార్ట్ ‌‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎన్నుకోబడుతారు. వీటి కోసం ఆన్‌ లైన్‌ లేదా ఆఫ్ ‌‌లైన్‌ లో అప్లై చేసుకోవాలి. ఇందుకు గాను చివరి తేది జూన్‌ 11. ఆఫ్ ‌‌లైన్ కాపీలను పంపడానికి చివరి తేది జూన్‌ 21. ఇక అవి పంపించాల్సిన అడ్రస్: అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిక్రూట్‌‌మెంట్ సెల్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్, రూం నెం. 14. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, మైదాన్ గార్హీ, న్యూఢిల్లీ–110068. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

 

 

ఇక అలాగే సెంట్రల్ ఇన్ లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. కోల్కతాలో ఉన్న ఐకార్ సెంట్రల్ ఇన్ లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పోస్టుల కొరకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో ఖాళీలు మొత్తం 06 పోస్టులు. ఇందులో పోస్టుల వివరాల్లోకి వస్తే... సీనియర్ రీసెర్చ్ ఫెలో–02, యంగ్ ప్రొఫెషనల్‌ (II ) – 04. వీటికి అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎఫ్‌ఎస్సీ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగుల సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకోవాలిసిన ఈ–మెయిల్: interviewcifri@gmail.com ఇక వీటికి ఆఖరు తేది జూన్ 16.

మరింత సమాచారం తెలుసుకోండి: