నిన్న మొన్నటి దాకా ప్రపంచాన్ని గజ గజ వణికించింది కరోనా.. ఈ మహమ్మారి ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండటంతో విద్యా, వాణిజ్య, రవాణా వ్యవస్థలు పూర్తిగా మూత పడిన సంగతి తెలిసిందే..ఇటు ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పడిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాలలు , స్కూల్స్ మూత పడటంతో విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నా , భిన్నం అయ్యింది.ప్రస్తుతం దేశం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రభుత్వాలు తిరిగి , పాఠశాలలను, స్కూల్స్ ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.



నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. ఇకపోతే కరోనా ముందు ఆగిపోయిన పరీక్షలను ప్రభుత్వం ఇప్పుడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణలో కొన్ని పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్రలో కూడా కొన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెంకటేశ్వర పశుసంవర్ధక వర్సిటీ, వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీ లో రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకై ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  ఈ ఉమ్మడి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.



ఈ పరీక్షలు వంద మార్కులకు ఉంటాయి.పదోతరగతి గణితం నుంచి 50, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 25, జీవశాస్త్రం నుంచి 25 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష నవంబర్‌ 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు. ఇక రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు http://www.rgukt.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు ఈ నెల 28 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.. నవంబర్ 10 వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు.  ఇక అప్లికేషన్ ఫీజు ఓసీలకు రూ.300, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 ఉండనుంది. హాల్ టికెట్లను నవంబర్ 22 న డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: