
ఇప్పుడు అన్నీ పరిస్థితులు సర్దుమనగడంతో నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో 510 పోస్ట్ ల భర్తీ ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల గడువు ఏడాది మాత్రమే. ఆ తర్వాత పనితీరు, అవసరాలను బట్టి గడువును పొడిగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు..
ఈ ఖాళీలు ఉన్న పోస్టుల వివరాల ను చూస్తే..
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 10 పోస్టులు
యంగ్ ఫెలో – 250 పోస్టులు
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ - 250 పోస్టులు
ఈ పోస్టులకు అర్హతల వివరాలు..
స్టేట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పోస్ట్ అర్హతలు..
సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీస అకడమిక్ మెరిట్ కూడా అవసరం. పదో తరగతిలో 60%, ఇంటర్మీడియట్‌లో 50%, గ్రాడ్యుయేషన్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు ఉండాలి.
వయసు: 01.11.2020 నాటికి 30-50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
యంగ్ ఫెలో అర్హతలు..
సోషల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత. అకడమిక్ మెరిట్ పదో తరగతిలో 60%, ఇంటర్మీడియట్‌లో 50%, గ్రాడ్యుయేషన్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులు ఉండాలి.
వయసు: 01.11.2020 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ అర్హతలు..
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో పని చేసిన అనుభవం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా పని చేసి ఉండడం/ ఎన్ఐఆర్‌డీపీఆర్/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములలో అనుభవం ఉండాలి..
వయసు: 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మధ్య ఉండాలి..
ఈ పోస్టుల జీతం వివరాలకోస్తే..
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ - దాదాపు 55 వేలు ఉండగా
యంగ్ ఫెలో – 35 వేలు
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ - 12,500 రూపాయలు ఉంటుంది.
ఇవి కాక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలను అందించనున్నారు..
http://nirdpr.org.in/ వెబ్ సైట్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. డిసెంబర్ 29 చివరి తేదీ..