ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్ష తేదీ ఫైనల్ గా ఖరారైంది.దీని కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించడం జరిగింది.ఇక ఈ మేరకు వారు సోషల్ మీడియా ద్వారా పరీక్ష తేదీని ప్రకటించడం జరిగింది.ఇక ఈ పరీక్ష నిర్వహణలో పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని వారు స్పష్టం చెయ్యడం జరిగింది. ఇక ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది.ఇక వాస్తవానికి జులై 3న ఈ పరీక్ష అనేది జరగాల్సి ఉంది. ఇక కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పరీక్షను వాయిదా వేయడం జరిగింది. సరిగ్గా మూడు నెలల తరువాత ఈ పరీక్షను నిర్వహించబోతోందట. ఇక ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు కూడా మారడం జరిగాయి. ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు అనేవి జరగనున్నాయి.ఇక ఆసక్తి ఇంకా అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చును.కాబట్టి వెంటనే త్వరపడండి. అప్లై చేసుకోండి.

ఇక ఇదిలా ఉండగా చాలా మందికి కూడా కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చెయ్యాలని కల. అలా కార్పొరేట్ సంస్థల్లో ఉన్నతమైన ఉద్యోగాలు కోరుకునే వారికి ఊరట కలిగించే గుడ్‌న్యూస్‌. ప్రముఖ దేశియ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన టీసీఎస్‌ యొక్క అనుబంధ సంస్థ అయిన టీసీఎస్‌ అయాన్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్ (TCS NQT 2021) ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా పలు కార్పొరేట్‌ సంస్థల్లో ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్లను చేపడడటం జరుగుతుంది. ఇక ఈ టెస్ట్‌లో ఎంట్రీ లెవల్‌ కి సంబంధించిన జాబ్స్‌కు కంపెనీలు అభ్యర్థి నుంచి ఆశించే సంబంధించి కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌ను ఈ ఎన్‌క్యూటీలో పరీక్షించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: