పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా పైకి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు  నేడు మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతుంది.. నిన్న మార్కెట్ లో ఆందోళన కలిస్తూ వచ్చిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో నిలకడగానే ఉండటం గమనార్హం.. మహిళలకు ఇది ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు కిందకు దిగి వచ్చాయి.. బంగారం ధరలు కిందకు దిగి వస్తే వెండి ధరలు మాత్రం మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి.


మనదేశంలో ధరలు మొత్తానికి స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..శనివారం పసిడి ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,580 వద్దనే స్థిరంగా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.. గోల్డ్ రేటు రూ. 48,200 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి ధరలు మాత్రం పైపైకి కదిలింది. కిలో వెండి రూ.500 పెరిగింది. దీంతో సిల్వర్ రేటు రూ. 74,600కు ఎగసింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే రేట్లు నమోదు అవుతున్నాయి..


ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలను చూస్తె ఒక్కసారి నేల చూపులు చూస్తున్నాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.ఔన్స్‌కు 0.41 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1992 డాలర్లకు చేరింది. బంగారం తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం తగ్గుదలతో 26.22 డాలర్లకు క్షీణించింది.. కాగా పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, వంటి మొదలగు పలు అంశాలు బంగారం ధరల పై ప్రభవాన్ని చూపిస్తున్నాయి..రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: