ఇటీవల కాలం లో ఎంతో మందిని వేధిస్తున్న వ్యాధి డయాబెటిస్.  ఇక ఉరుకుల పరుగుల జీవితం లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారపు అలవాట్ల తో ప్రస్తుతం ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఒకసారి డయాబెటిస్ బారిన పడ్డారు అంటే ఇక ఆ తర్వాత పరిస్థితులు ఎంతో దారుణం గా ఉంటాయి  ముఖ్యం గా డయాబెటిస్ బారిన పడిన తర్వాత ఏదైనా తినాలి అంటే కూడా వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డాక్టర్ల సూచనల మేరకే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.



 ఇక అటు సీజనల్ ఫ్రూట్స్ విషయం లో కూడా డయాబెటిస్ రోగులు ఎంతో కంట్రోల్డ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే కేవలం ఎండా కాలం లో మాత్రమే దొరికే మామిడిపండు చూస్తే అందరికీ నోరూరి పోతుంది.  అందుకే ప్రతి ఒక్కరు ఇక మామిడి పండ్లు లాగించేస్తూ ఉంటారు  అయితే డయాబెటిస్ రోగులు మాత్రం మామిడి పండ్లు తినాలా వద్దా అని ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు.  అయితే మామిడి పళ్ళు తినడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య కరమైన ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ వ్యాధి తో బాధ పడుతున్న వారు కొంతమంది మామిడి పండ్లు తినడానికి ఆసక్తి చూపుతుంటారు.




 అయితే మధుమేహం తో బాధపడుతున్న వారు మామిడి పండ్లు ఎక్కువగా తినడం ఏ మాత్రం మంచిది కాదు అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు. కేవలం ఎండా కాలంలో మాత్రమే దొరికే మామిడి పళ్ళనూ ఇక మధు మేహంతో ఉన్నవారు తక్కువగా తింటేనే మంచిది అంటూ చెబుతున్నారు. రోజుకి 100 లేదా 150 గ్రాముల మామిడి పండ్లు మాత్రమే తినాలని సూచిస్తున్నారు. అది కూడా భోజనం చేసిన వెంటనే అస్సలు తినకూడని..  స్నాక్స్ లాగా అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: